108 ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన షార్జా రూలర్

108 ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన షార్జా రూలర్

షార్జా:ఈద్-అల్-ఫితర్ పండుగను పురస్కరించుకుని షార్జా సర్కార్ 108 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ మెంబర్‌, షార్జా రూలర్‌ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశాలు జారీ చేశారు. వివిధ దేశాలకు చెందిన 108 మంది ఖైదీలను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా విడిచిపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జారి అల్ షంసీ... షార్జా రూలర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఖైదీల పట్ల రూలర్‌ మానవీయ దృక్పథంతో ఆలోచించి క్షమాభిక్ష పెట్టడం మంచి పరిణామం అని షంసీ పేర్కొన్నారు. 

Back to Top