ఏ.పి:పేద అర్చకులు,ఇమామ్‌లు,మౌజామ్‌లు,పాస్టర్లకు ఆర్థికసాయం

- May 26, 2020 , by Maagulf
ఏ.పి:పేద అర్చకులు,ఇమామ్‌లు,మౌజామ్‌లు,పాస్టర్లకు ఆర్థికసాయం

అమరావతి:ఏ.పిలో అర్చకులు, ఇమామ్‌లు, మౌజామ్‌లు, పాస్టర్లకు వన్‌టైమ్ సాయం కింద ఒక్కొక్కరికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి 33 కోట్ల 92 లక్షల రూపాయలు రెవన్యూ శాఖ విడుదల చేసింది. నేరుగా అర్హుల అకౌంట్లలో ఐదేసి వేల చొప్పున డిపాజిట్ చేస్తారు. కరోనా ప్రభావంతో ఆయా వర్గాలకూ ఆర్థిక ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో.. జీవన భృతి కింద వారికి ఈ సాయం చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది. పేదల అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు సాయం కోసం ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖ, వక్ఫ్‌బోర్డు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లు ఉపయోగించుకోవాలని రెవెన్యూ శాఖ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 31 వేల మంది అర్చకులకు, 7 వేల మంది ఇమామ్‌లు-మౌజామ్‌లకు, దాదాపు 30 వేల మంది పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com