మే 31 నుంచి సౌదీ అరేబియాలో డొమెస్టిక్‌ విమానాలు

- May 27, 2020 , by Maagulf
మే 31 నుంచి సౌదీ అరేబియాలో డొమెస్టిక్‌ విమానాలు

రియాద్‌: సౌదీ అరేబియా ఆదివారం (మే 31) నుంచి డొమెస్టిక్‌ విమానాలకు అనుమతినివ్వనుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో డొమెస్టిక్‌, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం విదితమే. కాగా, క్రమక్రమంగా సౌదీ అరేబియాలో లాక్‌డౌన్‌ నుంచి వివిధ రంగాలకు మినహాయింపులు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే డొమెస్టిక్‌ విమానాలు తిరిగేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నట్లు జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (జిఎసిఎ) పేర్కొంది. డొమెస్టిక్‌ విమానాలకు అనుమతి లభించినప్పటికీ, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని విమానాల్ని నడపనున్నట్లు జిఎసిఎ పేర్కొంది. మొత్తం 11 విమానాశ్రయాల్లో మాత్రమే విమానాల రాకపోకలకు అనుమతిస్తారు. రియాద్‌, జెడ్డా, దమ్మామ్, మదీనా, కాసిమ్, అభా, తబుక్‌, జజాన్‌, హయిల్‌, అల్‌ బాహా మరియు నజ్రాన్‌ విమానాశ్రయాలు ఇందులో వున్నాయి. మార్చి 21 నుంచి డొమెస్టిక్‌ విమానాలు సౌదీ అరేబియాలో రద్దయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com