వందే భారత్ మిషన్ కు భారీ షాక్..రద్దైన 92 ఎయిరిండియా విమానాలు
- May 27, 2020
మే-25న ఢిల్లీ నుంచి లుధియానా వరకు ఎయిర్ లైన్స్ ఎయిర్ విమానంలో ప్రయాణించిన ఓ ప్యాసింజర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎయిరిండియా ఇవాళ(మే-27,2020) తెలిపింది. దీంతో ఐదుగురు విమాన సిబ్బందితో సహా విమానంలో ప్రయాణించిన 41మంది క్వారంటైన్ అయినట్లు తెలిపింది. ఎయిరిండియాలో భాగమైన ఎయిర్ లైన్స్ ఎయిర్ ప్రాంతీయ విమానాలను నడుపుతుంది.
మరోవైపు మే-25న 6E 381 విమానంలో చెన్నై-కోయంబత్తూరుకి ప్రయాణించిన ఓ ప్యాసింజర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇండిగో తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల దాదాపు రెండు నెలల పాటు ఎనేలపైనే ఉండిపోయిన దేశీయ విమానాలు సోమవారం(మే-25,2020) నుంచి గాల్లోకి ఎగిరిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ సమయంలో విమాన ప్రయాణికులకు ఎయిరిండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు మార్గాల్లో విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పరిమిత కార్యకలాపాలు, క్వారంటైన్ నిబంధనల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. మే 28-31తేదీల్లో నడవాల్సిన 92 విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దీంతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో స్లాట్లు అందుబాటులో లేవని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
రద్దు అయిన విమానాల్లో హైదరాబాద్-బెంగళూరు,ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-కోల్ కతా, చెన్నై-ఢిల్లీ, కోల్‌కతా-గౌహతి, చెన్నై-బెంగళూరు, చెన్నై-ముంబై, ముంబై-భోపాల్, కోల్‌కతా-దిబ్రుగర్, కోల్ కతా-అగర్తలా, ముంబై-ఢిల్లీ, ముంబై-అహ్మదాబాద్ తదితర మార్గాల మధ్య నడిచేవి ఉన్నాయి. రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించి టికెట్లను ఇప్పటికే కొనుగోలు చేసినవారు 2020 ఆగస్టు 24 వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉన్న విమానాల్లో బుక్ చేసుకునేందుకు ఎయిరిండియా అనుమతినిచ్చింది. రూటు మార్చుకునేందుకు అనుమతి ఉంటుందని, ఛార్జీల్లో వ్యత్యాసం తప్ప, దీనికి సంబంధించిన చార్జీలను రద్దు చేసినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







