దుబాయ్:1100కి పైగా ఆల్కహాల్ బాటిల్స్ సీజ్
- May 27, 2020
దుబాయ్:దుబాయ్ పోలీస్, ఏడుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి 1,483 ఆల్కహాల్ బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈద్ అల్ పితర్ సెలవుల్లో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. జబెల్ అలి పోలీస్ స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ అదెల్ మొహమ్మద్ అల్ సువైది మాట్లాడుతూ, ఓ ఎడారిలో బాటిల్స్‌ని డంప్ దాచి పెట్టి వుంచారని చెప్పారు. ఆసియాకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ వుడెన్ బాక్స్‌ని బయటకు తీశారనీ, పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసి, వారి నుంచి 1,110 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. మరో ఘటనలో ఇద్దరు ఆసియా జాతీయులు ఆల్కహాల్ తరలిస్తుండగా, వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి 115 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మూడో ఘటన ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. మొత్తం 258 బాటిల్స్‌ని పోలీసులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







