దోహా:మళ్లీ ప్రారంభమైన వింటర్ కూరగాయల మార్కెట్..కొత్త టైమింగ్స్ అమలు
- May 27, 2020
దోహా:రమదాన్ సందర్భంగా 3 రోజుల సెలవుల తర్వాత వింటర్ కూరగాయల మార్కెట్లు మళ్లీ ప్రారంభం అయ్యింది. అయితే..అల్ మజ్రోవా, అల్ వక్రా, అల్ ఖోర్, అల్ ధాకిరాలోని కూరగాయల మార్కెట్లలో కొత్త సమయాలను అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్ల సమయాలను కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మార్కెట్లు తెరిచి ఉంటాయని పురపాలక, పర్యావరణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అయితే..మార్కెట్లో కూరగాయల దుకాణాల యజమానులతో పాటు వినియోగదారులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







