లాక్ డౌన్ 5.0 దేశవ్యాప్త లాక్ డౌన్ మరో 2వారాలు పొడిగించే అవకాశం
- May 27, 2020
న్యూఢిల్లీ:భారత దేశవ్యాప్త లాక్ డౌన్ ను కేంద్రం మరో 2వారాలు పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31న మన్ కీ బాత్ ప్రసంగ సమయంలోనే ప్రధాని మోడీ లాక్ డౌన్ 5.0ప్రకటన చేయనుట్లు సమాచారం. మే-31తో లాక్ డౌన్ 4.0 ముగియనున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో జూన్-1నుంచి ప్రారంభమయ్యే తదుపరి దశ లాక్ డౌన్ 5.0 గురించి ఈ నెల చివరి ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ ప్రకటించనున్నారు.
లాక్ డౌన్ 5.0లో అనేక సడలింపులను కేంద్రం ఇవ్వనుంది. ప్రార్థనా మందిరాలతో పాటు జిమ్ లకు కూడా లాక్ డౌన్ 5.0లో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అయితే సోషల్ డిస్టెన్స్,మాస్క్ లు ధరించడం మాత్రం తప్పనిసరిగా ఉండనుంది. పబ్లిక్ గేథరింగ్(ప్రజలు ఎక్కువమంది ఒక చోట గుమికూడటం)కు అనుమతిచ్చే అవకాశం లేదు.
ఈ లాక్ డౌన్ 5.0 సమయంలో ఎటువంటి పండుగలు,ఉత్సవాలకు అనుమతించే అవకాశం కూడా లేదు. విద్యాసంస్థలు,సినిమా థిమేటర్లు,మాల్స్ ఎప్పటిలాగే మూసివేయబడి ఉండనున్నాయి.పెళ్లిళ్లు మరియు అంత్యక్రియలు వంటి వాటికి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలు హాజరయ్యే వీలు ఉంటుంది. హోంమంత్రిత్వశాఖ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం....ముఖ్యంగా దేశంలోని 70శాతం కరోనా కేసులు ఉన్న 11సిటీలపై లాక్ డౌన్ 5.0ఫోకస్ ఉంటుంది.
ఢిల్లీ,ముంబై,చెన్నై,ఇండోర్,పూణే,బెంగళూరు,థానే,అహ్మదాబాద్,జైపూర్,సూరత్,కోల్ కతా సిటీలపై జూన్-1నుంచి ప్రారంభమయ్యే లాక్ డౌన్ 5.0ఫోకస్ ఉంటుంది. ఈ సిటీల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు నమోదైన 1.51లక్షల కోవిడ్-19 కేసుల్లో 60శాతం కేసులు ఢిల్లీ,అహ్మదాబాద్,కోల్ కతా,ముంబై,పూణేలోనే నమోదయ్యాయి. అంతకుముందు దేశవ్యాప్తంగా 80శాతం కరోనా కేసులున్న 30మున్సిపల్ కార్పొరేషన్ల ఏరియాల లిస్ట్ ను కేంద్రం రెడీ చేసింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







