1500 ప్రవాసీయులపై వేటుకు రంగం సిద్ధం చేసిన కువైట్ ఎయిర్ వేస్
- May 28, 2020
కువైటైజేషన్ లో భాగంగా కువైట్ ఎయిర్ వేస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన 6000 వేల మంది ఉద్యోగుల్లో 1500 మంది ప్రవాసీయులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కువైట్ ఎయిర్ వేస్ సీఈవో ఓ కమిటీని కూడా నియమించారు. ఇందులో సంస్థలోని కీలక విభాగాల్లోని ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నేతలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సీఈవో నిర్ణయం ప్రకారం ప్రవాసీయుల సంఖ్యను తగ్గించే దిశగా కసరత్తు చేయనుంది. డిపార్ట్మెంట్ ల వారీగా ప్రవాసీయుల సంఖ్య...ఆయా విభాగాల్లో ఎంత మేరకు వారి అవసరం ఉందో గుర్తించి ఎవరెవర్ని తొలగించాలనేది కమిటీ జాబితా రూపొందించనుంది. అయితే..కువైటిస్, గల్ఫ్ సిటిజన్స్, కువైట్ మహిళలను పెళ్లాడిన వారిపై వేటు ఉండదని కూడా సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. అలాగే 60 ఏళ్లు దాటిన కువైట్ సిటిజన్ల సేవలను కూడా ముగించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాయి. కువైటైజేషన్ ప్రణాళిక అమలులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వెల్లడించాయి. మరోవైపు కరోనా సంక్షోభం తర్వాతి పరిస్థితుల్ని ఎదుర్కొవటం కూడా ఉద్యోగుల తొలగింపునకు మరో కారణంగా కనిపిస్తోంది. కరోనా కారణంగా మధ్యప్రాశ్చ దేశాల్లో 1.2 మిలియన్ల ఉద్యోగులపై ప్రభావం ఉండనుందని ఓ అంచనా.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?