షెడ్యూల్డ్, ట్రాన్సిట్ విమానాల కార్యకలాపాలకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సంసిద్ధం
- May 29, 2020దుబాయ్: దుబాయ్ ఎయిర్ పోర్ట్స్, షెడ్యూల్డ్ విమానాలు అలాగే ట్రాన్సిట్స్ విమానాల కార్యకలాపాలకు కొత్తగా అమల్లోకి తెచ్చిన సేఫ్టీ మెజర్స్ ద్వారా నిర్వహించేందుకు సంసిద్ధంగా వున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డిప్యూటీ సీఈఓ జమాల్ అల్ హాయి ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రావెలర్స్ కోసం రెస్టారెంట్లు, కేఫ్‌లు ఇతర షాప్‌లు అందుబాటులో వుంటాయని చెప్పారు. ప్రొటెక్టివ్ గ్లాస్‌ని ఆయా ఫెసిలిటీస్‌లో ఏర్పాటు చేశారు. బాడీ హీట్ డిటెక్టర్స్ సహా సోషల్ డిస్టెన్సింగ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, గతంలోలా ఎలాంటి భయాలూ లేకుండా ప్రయాణీకులు పూర్తి స్వేచ్ఛతో ప్రయాణాలు కొనసాగించడానికి కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నేపధ్యంలో విధించిన ఆంక్షల నుంచి ఇప్పుడిప్పుడే సడలింపులు చోటు చేసుకుంటున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం