ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత
- May 29, 2020
ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని అజిత్ తనయుడు అమిత్ జోగి ట్విటర్లో వెల్లడించారు. గత కొన్నాళ్లుగా రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. 1946 ఏప్రిల్ 29న బిలాస్పూర్లో జన్మించిన అజిత్.. భోపాల్ మౌలానా అజాద్ కాలేజ్ విద్యనభ్యసించారు. 2000-2003 మధ్య కాలంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1981-85 మధ్య భోపాల్ జిల్లా కలెక్టర్‌గానూ సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 1986-98 మధ్య కాలంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 1998, 2004లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి 2016లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పార్టీని స్థాపించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







