మిన్నియా పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

- May 29, 2020 , by Maagulf
మిన్నియా పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

అమెరికాలోని మిన్నియా పోలిస్‌లో ఓ నల్లజాతీయుడి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆ ఘటనను నిరసిస్తూ ఇవాళ వరుసగా మూడవ రోజు కూడా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. మిన్నియాపోలిస్‌లో పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అనేక బిల్డింగ్‌లను కాల్చేశారు. లూటీలకు పాల్పడ్డారు. కస్టడీలోకి తీసుకున్న నల్లజాతీయుడు మృతిచెందడం పట్ల స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని మిన్నసొట రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేసినా ఆందోళనలు మాత్రం ఆగలేదు. 46 ఏళ్ల జార్జ్ ప్లాయిడ్ మృతి పట్ల ఆందోళనకారులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
ఓ రెస్టారెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే జార్జ్‌ ఫ్లైడ్‌పై ఒక కస్టమర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు కిందపడేసి చేతికి సంకెళ్లు వేశారు. ఇంతలో ఓ పోలీసు అధికారి జార్జ్‌ గొంతుపై మోకాలితో బలంగా నొక్కిపెట్టాడు. అతడు ఎంత ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు. కొంతసేపటికి జార్జ్‌లో చలనం లేకపోవడంతో అతడు చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో విస్త్రృతంగా ప్రచారమయ్యాయి. ఈ అమానుషాన్ని ఖండిస్తూ శ్వేత, నల్లజాతీయులు నిరసన చేపట్టి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. నలుగురు పోలీసులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మేయర్‌ జాకబ్‌ ఫ్రే చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com