భారత్ లో పెరిగిన కరోనా కేసులు..
- May 30, 2020
భారతదేశంలో గత 24 గంటల్లో… 7 వేల 466 కొత్త కేసులు నమోదవగా… 175 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు.. దాదాపు 5 వేలకు చేరుకున్నాయి. చైనాలో ఇప్పటి వరకు 4 వేల 634 మరణాలు సంభవించగా.. ఆ సంఖ్యను మనం దాటడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసుల నమోదులో 9 వ స్థానానికి చేరుకోగా… మరణాల్లో 13వ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కరోనాతో 116 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇవే అత్యధిక మరణాలు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2 వేలు దాటింది. కొత్తగా 2 వేల 682 కేసులు నమోదు కాగా… మొత్తం కేసులు 62 వేలు దాటాయి. గత 24 గంటల్లో 116 మంది పోలీసు సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో మహారాష్ట్ర పోలీసు శాఖలో కరోనా బారినపడ్డవారి సంఖ్య 2 వేల 2 వందలు దాటింది. వీరిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. స్లమ్ ఏరియా ధారావిలో కొత్తగా 41 కేసులు వెలుగు చూడగా… మొత్తం కేసులు 17 వందల 15కి చేరాయి. ఇప్పటి వరకు ఒక్క ధారావి ప్రాంతంలో 70 మంది చనిపోయారు.
దేశంలోని కరోనా రికవరీ రేటు 42.89 శాతంగా ఉందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 20 వరకు 279 శ్రామిక్ ప్రత్యేకరైళ్లను నడిపినట్టు.. రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. వాటి ద్వారా 3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామన్నారు. వారిలో ఎక్కువ మంది యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందినవారే. మరోవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో 27 లక్షల మంది వలస కూలీలు యూపీ చేరుకున్నట్టు ఆ రాష్ట్రం తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు