కువైట్:ఆదివారం నుంచి కూడా ఆన్‌ లైన్‌ లోనే బ్యాంక్ సర్వీసులు..

- May 30, 2020 , by Maagulf
కువైట్:ఆదివారం నుంచి కూడా ఆన్‌ లైన్‌ లోనే బ్యాంక్ సర్వీసులు..

కువైట్ సిటీ:కువైట్‌ లో బ్యాంక్‌ సేవల పునరుద్ధరణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. మే 31 నుంచి బ్యాంకు బ్రాంచులన్ని తెరుచుకుంటాయని ముందుగా అంతా భావించినా..ఆదివారం నుంచి కూడా బ్రాంచులు తెరుచుకోవటం లేదని కువైట్‌ బ్యాంకింగ్ అసోసియేషన్‌ స్పష్టత ఇచ్చింది. ఆదివారం నుంచి కూడా కస్టమర్లకు ఆన్‌ లైన్‌ లోనే సర్వీసులను అందించనున్నట్లు కూడా తెలిపింది.  ఆర్ధిక లావాదేవీలన్ని ఆన్‌ లైన్‌ లోనే నిర్వహించుకోవలని కూడా అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. దేశీయంగా జరిపే లావాదేవీలతో పాటు, అంతర్జాతీయంగా జరిపే లావాదేవీలు కూడా ఆన్‌ లైన్‌ లోనే నిర్వహించాలని సూచించింది. డబ్బులను ఎటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలని..అలాగే ఏదైనా ఫిర్యాదులు చేయాలంటే కస్టమర్స్‌ సర్వీస్‌ కు ఫోన్‌ చేయాలని కువైట్‌ బ్యాంకింగ్ అసోసియేషన్‌ వినియోగదారులకు సూచించింది. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com