వందే భారత్ మిషన్:పైలట్‌కు కోవిడ్-19.. విమానం వెనక్కి
- May 30, 2020
న్యూఢిల్లీ:వందేభారత్ మిషన్‌లో భాగంగా మాస్కో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మధ్య నుంచే వెనక్కి పిలిపించారు. ఫైలట్‌కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీ విమానాన్ని రప్పించారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వందేభారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తరలిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాస్కోకు ఎయిర్ ఇండియా ఏ-320 విమానం కూడా బయల్దేరింది. ఫైలట్ సహా సిబ్బందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. విమానం ఉజ్బెకిస్తాన్ గగనతలంలో ఉండగా.. ఫైలట్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీంతో అధికారులు వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానాన్ని వెంటనే ఇండియా రావాలని ఆదేశించారు. దీంతో విమానం ఖాళీగానే ఢిల్లీ చేరుకుంది.
విమానం ల్యాండయిన వెంటనే ఫైలట్ సహా సిబ్బందిని క్వారంటైన్లోకి తరలించారు. మాస్కోలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు మరో విమానం పంపిస్తామని ఏవియేషన్ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించడంతో మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్నవారిని మాత్రం 'వందేభారత్ మిషన్' ద్వారా తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ 4.0 సడలింపులతో దేశంలో విమానాలు మాత్రం తిరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు