కార్మికుల పనివేళల్లో మార్పు

- May 31, 2020 , by Maagulf
కార్మికుల పనివేళల్లో మార్పు

కువైట్: బహిరంగ ప్రదేశాలలో ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మానవ వనరుల శాఖ. రేపటి నుండి మొదలై ఆగస్టు చివరి వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అథారిటీ జనరల్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా ఈ రోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వేసవి కాలపు కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కాలంలో పనిచేయడం కష్టతరం కావున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

ఈ 3 నెలల వ్యవధిలో కమిషన్‌లోని తనిఖీ బృందాలు ప్రతిచోటా ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తారనీ, ఆదేశాలను ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అహ్మద్ అల్ మౌసా అన్నారు. గడిచిన సంవత్సరాల్లో ఈ నిర్ణయం అమలు చేయడం వల్ల అనేక రంగాలలో అనేక కంపెనీల ఆమోదం మరియు అంగీకారం లభించిందని తద్వారా కార్మికులకు ఈ వేసవి ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందని అహ్మద్ అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com