కువైట్: వీసా గడువు పొడిగింపు

- June 01, 2020 , by Maagulf
కువైట్: వీసా గడువు పొడిగింపు

కువైట్: కరోనా వైరస్ సంక్షోభం పరిస్థితుల దృష్ట్యా చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ ఉన్నవారు విదేశాలలో చిక్కుకున్నట్లైతే, వారికి గ్రేస్ వ్యవధిని 1 సంవత్సరానికి పెంచినట్టు వెల్లడించిన అధికారులు.

ప్రస్తుతం, చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న ఎవ్వరైనా 6 నెలల్లోపు కువైట్కు తిరిగి రావాలి. కానీ, ఈ కరోనా సంక్షోభం వలన అంతర్జాతీయ ప్రయాణం నిలిచిపోయినందున, కువైట్ అధికారులు ఈ గ్రేస్ వ్యవధిని 1 సంవత్సరం పొడిగించారు.

ప్రస్తుతం కువైట్ లోనే ఉన్న ప్రతివాసీయులకు వీసా గడువు ముగిసినట్లైతే, ఆగస్టు 31 వరకు 3 నెలలు స్వయంచాలకంగా తాత్కాలిక వీసా మంజూరు చేయబడుతుందని ఐఐకె గతంలో నివేదించింది. వేలిముద్ర కారణంగా వారి రెసిడెన్సీని పునరుద్ధరించలేని వారికి కూడా ఈ ఆటో పొడిగింపు వర్తిస్తుంది అని అధికారులు గుర్తుచేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com