నిజ్వా స్కూల్‌ బస్‌ యాక్సిడెంట్‌లో 6కి చేరిన మృతులు

- January 31, 2016 , by Maagulf
నిజ్వా స్కూల్‌ బస్‌ యాక్సిడెంట్‌లో 6కి చేరిన మృతులు


నిజ్వా స్కూల్‌ బస్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 6కి చేరినట్లు అధికారుల వెల్లడించారు. క్లాస్‌ 2 స్టూడెంట్‌ ఈ ప్రమాదంలో తాజాగా మృతి చెందారు. ఘటనా స్థలంలో నలుగురు మృత్యువాత పడగా, ఒక టీచర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో స్టూడెంట్‌ ఆసుపత్రిలో చనిపోవడంతో మృతుల సంఖ్య 6కి చేరింది. విహార యాత్రకు వెళ్ళిన విద్యార్థి బృందానికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొన్ని బస్సులు ఎలాంటి ప్రమాదం లేకుండా విహార యాత్రను ముగించుకోగా ఓ బస్సు మాత్రమే ప్రమాదానికి గురయ్యింది. ఘటన పట్ల స్కూల్‌ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com