మస్కట్:నిర్మాణ రంగంలోని కార్మికులకు మధ్యాహ్నం వేళలో 3 గంటల విశ్రాంతి
- June 02, 2020
మస్కట్:వేసవి ఎండల నుంచి రక్షించుకునేందుకు నిర్మాణ రంగంలోని కార్మికులకు పని వేళ్లలో స్వల్ప మార్పులు ప్రకటించింది మానవ వనరుల శాఖ. ఈ మూడు నెలల పాటు వేసవి ఎండలు అతి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉండటంతో మధ్యాహ్నం వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు పనులు పురమాయించొద్దని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల వరకు వారికి మధ్యాహ్నన విరామ సమయంగా ప్రరిగణించాలని కోరింది. జూన్, జులై, ఆగస్ట్ మాసాలకు సంబంధించి ఈ కొత్త నిబంధనలు అమలులో ఉంటాయి. కార్మిక చట్టాల్లోని ఆర్టికల్ 16-3 ప్రకారం నిర్మాణ రంగంలోని కార్మికులకు వేసవిలో మిట్ట మధ్యాహ్నం వేళ పని చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. కార్మిక చట్టాలను అనుసరించి ఈ మూడు నెలలు మిడ్ డే బ్రేక్ సమయాలను మానవ వనరుల శాఖ అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!