కోవిడ్-19 పై పోరాటం: యూఏఈ చేరుకోనున్న 172 మంది నర్సులు
- June 02, 2020
దుబాయ్: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక ‘ఫ్లై దుబాయ్’ విమానం లో 172 మంది నర్సులను దుబాయ్ కు తీసుకురానున్నారు. వీరంతా కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోని ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రుల నుండి ఎంపిక చేయబడినవారు. వీరందరిని మొదటి రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచిన తరువాత వారిని వివిధ ఆసుపత్రులకు కేటాయించనున్నారు.
ఈ వైద్య బృందం యూఏఈ కి ప్రయాణించటానికి MEA (విదేశాంగ మంత్రిత్వ శాఖ) తమ అనుమతి ఇవ్వడంతోపాటు అన్ని లాంఛనాలు పూర్తిచేసుకొని నేడు బయలుదేరుటకు సిద్ధంగా ఉంది అని ఇండియా లోని యూఏఈ రాయబార కార్యాలయం తెలిపింది.
దుబాయ్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హుమైద్ అల్ కుతామి మాట్లాడుతూ, " ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. సమాజానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ కార్మికులకు మా కృతజ్ఞతలు" అని అన్నారు.
కాగా, కరోనావైరస్ పై పోరాటంలో తమవంతు సాయం అందించేందుకు మే నెలలో 88 మంది వైద్యులు మరియు నర్సులను యూఏఈ కి రావటం జరిగింది. అంతేకాకుండా, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి భారతదేశం ఇంతకుముందు 15 మంది గల వైద్య బృందాన్ని కువైట్ కు పంపిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు