శ్రీ కాంత్‌ చిత్రం 'మెంటల్‌ పోలీస్‌'

- January 31, 2016 , by Maagulf
శ్రీ కాంత్‌  చిత్రం 'మెంటల్‌ పోలీస్‌'

శ్రీ కాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మెంటల్‌ పోలీస్‌'. కరణం పి.బాబ్జీ దర్శకుడు. వి.వి.ఎస్‌.ఎన్‌.వి.ప్రసాద్‌ దాసరి, వి.వి.దుర్గాప్రసాద్‌ అనగాని నిర్మాతలు. హైదరాబాద్‌లో వి.సముద్ర, శ్రీకాంత్‌ ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ ''దర్శకుడు నా కోసమే రాసుకున్న కథ ఇది. 'ఖడ్గం', 'ఆపరేషన్‌ దుర్యోధన' తర్వాత అంతటి శక్తిమంతమైన పాత్ర ఈ సినిమాలో చేశాన''న్నారు. ''సమాజంలోని లొసుగుల్ని ఎత్తి చూపించిన పోలీసు కథ ఇది. మా ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంద''న్నారు.త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాతలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com