బహ్రెయిన్:ఏ.పి వాసి మృతి...అంత్యక్రియలు అక్కడే
- June 05, 2020
మనామా: బహ్రెయిన్ లో రాజమండ్రి(ఏ.పి) కి చెందిన 21 సంవత్సరముల వనపర్తి మహేష్ ఉద్యోగం నిమిత్తం జనవరి నుంచి బహ్రెయిన్ లో పనిచేస్తున్నాడు.కాని ఉద్యోగం ఇష్టం లేక ఇండియా వెళ్లిపోవాలని తన ఉద్దేశ్యం కంపెనీ యజమానికి చెప్పగా టిక్కెట్ ఖర్చులను తానే భరించి వెళ్లిపోవాలని యజమాని అన్నాడు. మార్చ్ 24వ తేదీన మహేష్ టక్కెట్ బుక్ చేసుకోగా, కరోనా ప్రభావంతో 22 నుంచి విమాన సర్వీసులు నిలిపివేశారు. మానసిక ఒత్తిడికి లోనైన మహేష్ 23న ఆత్మహత్య చేసుకున్నాడు.
కంపెనీ అందించిన సమాచారంతో బహ్రెయిన్ కార్మిక బంధు అయిన శివ కుమార్ వెంటనే మహేష్ తండ్రి కి ఫోన్ చేసి సమాచారం అందించటం జరిగింది. ప్రస్తుత కరోనా మూలంగా ప్రయాణ నిబంధనల కారణంగా, లాక్ డౌన్ దృష్ట్యా విమాన సర్వీసులు నిలిచిపోయిన కారణాన మహేష్ అంత్యక్రియలను అతని కుటుంబ అంగీకారంతో బహ్రెయిన్ లో చేయటం జరిగింది.
అంత్యక్రియలకు కావాల్సిన బహ్రెయిన్ ప్రభుత్వ అనుమతి పత్రములు అన్ని సిద్ధం చేసి గురువారం అంత్యక్రియలను పూర్తి చేయటం జరిగింది.మహేష్ అంత్యక్రియలకు శివకుమార్ తో పాటు ప్రేమ్ మరియు కంపెనీకి సంబంధించిన పలువురు హాజరయ్యారు.
ఆపదలో ఉన్న భారతీయ సోదరులకు బహ్రెయిన్ శ్రామిక బంధు అయిన డి.వి.శివకుమార్ అందిస్తున్నసేవలు ప్రశంసనీయములు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు