హర్భజన్ సింగ్ 'ఫ్రెండ్ షిప్`ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్
- June 05, 2020
తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి 'ఫ్రెండ్ షిప్` సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలలో యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ నటుడు సతీష్ నటిస్తున్నారు. కాగా ఈరోజు 'ఫ్రెండ్ షిప్`మూవీ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్, లోస్లియా మరియనేసన్ కలిసి ఉన్న ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. సినిమాలోని ఇతర నటీనటులు. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ నటుడు సతీష్, లోస్లియా మరియనేసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్, ప్రొడ్యూసర్స్: జెపిఆర్ & స్టాలిన్, దర్శకత్వం: జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







