బహ్రెయిన్:ఏ.పి వాసి మృతి...అంత్యక్రియలు అక్కడే

- June 05, 2020 , by Maagulf
బహ్రెయిన్:ఏ.పి వాసి మృతి...అంత్యక్రియలు అక్కడే

మనామా: బహ్రెయిన్ లో రాజమండ్రి(ఏ.పి) కి చెందిన 21 సంవత్సరముల వనపర్తి మహేష్ ఉద్యోగం నిమిత్తం జనవరి నుంచి బహ్రెయిన్ లో పనిచేస్తున్నాడు.కాని ఉద్యోగం ఇష్టం లేక ఇండియా వెళ్లిపోవాలని తన ఉద్దేశ్యం కంపెనీ యజమానికి చెప్పగా టిక్కెట్ ఖర్చులను తానే భరించి వెళ్లిపోవాలని యజమాని అన్నాడు. మార్చ్ 24వ తేదీన మహేష్ టక్కెట్ బుక్ చేసుకోగా, కరోనా ప్రభావంతో 22 నుంచి విమాన సర్వీసులు నిలిపివేశారు. మానసిక ఒత్తిడికి లోనైన మహేష్ 23న ఆత్మహత్య చేసుకున్నాడు.

కంపెనీ అందించిన సమాచారంతో  బహ్రెయిన్  కార్మిక బంధు అయిన శివ కుమార్ వెంటనే మహేష్ తండ్రి కి ఫోన్ చేసి సమాచారం అందించటం జరిగింది. ప్రస్తుత కరోనా మూలంగా ప్రయాణ నిబంధనల కారణంగా, లాక్ డౌన్ దృష్ట్యా విమాన సర్వీసులు నిలిచిపోయిన కారణాన మహేష్ అంత్యక్రియలను అతని కుటుంబ అంగీకారంతో బహ్రెయిన్ లో చేయటం జరిగింది. 

అంత్యక్రియలకు కావాల్సిన బహ్రెయిన్ ప్రభుత్వ అనుమతి పత్రములు అన్ని సిద్ధం చేసి గురువారం అంత్యక్రియలను పూర్తి చేయటం జరిగింది.మహేష్ అంత్యక్రియలకు శివకుమార్ తో పాటు ప్రేమ్ మరియు కంపెనీకి సంబంధించిన పలువురు హాజరయ్యారు.  
ఆపదలో ఉన్న భారతీయ సోదరులకు బహ్రెయిన్ శ్రామిక బంధు అయిన డి.వి.శివకుమార్ అందిస్తున్నసేవలు ప్రశంసనీయములు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com