40 డెస్టినేషన్స్‌కి ఖతార్ ఎయిర్‌వేస్ ఆపరేషన్స్ పునరుద్ధరణ
- June 05, 2020
దోహా:ఖతార్ ఎయిర్‌వేస్.. బ్యాంకాక్, బార్సెలోనా, ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, సింగపూర్ మరియు వియెన్నా వంటి ప్రాంతాలకు ఆపరేషన్స్‌ని పునరుద్ధరించింది ఈ వారంలో. 40కి పైగా డెస్టినేషన్స్‌కి 170 వీక్లీ విమాన సర్వీసుల్ని నడుపుతోంది. బెర్లిన్, డార్ ఎస్ సలామ్, న్యూయార్క్, టునిస్ మరియు వెనిస్ నగరాలకు కూడా విమాన సర్వీసుల్ని పునరుద్ధరించనుంది. డబ్లిన్, మిలాన్, రోమ్ నగరాలకు డెయిలీ విమానాల్ని పెంచనుంది. ప్రస్తుత ఛాలెంజింగ్ సమయంలో ఖతార్ ఎయిర్‌వేస్ తన సామర్థ్యాన్ని మరోమారు చాటుకుంటోంది అత్యధిక సర్వీసులు, డెస్టినేషన్స్‌ని పునరుద్ధరించడం ద్వారా. ప్రయాణీకుల్ని పూర్తి భద్రతతో గమ్యస్థానాలకు చేర్చుతోన్న ఖతార్ ఎయిర్‌వేస్, అవసరమైన అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటోంది కరోనా వైరస్ నేపథ్యంలో. ప్రాయాణీకుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని, బుకింగ్ పాలసీలను ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. అన్‌లిమిటెడ్ డేట్ ఛేంజెస్‌ని ప్రయాణీకులకు అందిస్తోంది. 2020కి ముందు ఎలాంటి ఫేర్ డిఫరెన్స్‌నీ ప్రయాణీకుల నుంచీ వసూలు చేయబోవడంలేదని ఖతార్ ఎయిర్ వేస్ పేర్కొంది. 31 డిసెంబర్ 2020 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లు, జారీ చేసిన సమయం నుంచి మరో రెండేళ్ళపాటు చెల్లుబాటు కానున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు