జనవరి 2021 నుంచి వలసదారులకు ఎంప్లాయర్‌ని మార్చుకునే వీలు

- June 08, 2020 , by Maagulf
జనవరి 2021 నుంచి వలసదారులకు ఎంప్లాయర్‌ని మార్చుకునే వీలు

ఒమాన్: జనవరి 21 నుంచి వలసదారులు, తమ ఎంప్లాయర్‌ని మార్చుకునే వీలు కలుగుతుంది. అయితే, కొన్ని షరతులను/నిబంధనలను వలసదారులు పూర్తి చేయాల్సి వుంటుంది. పోలీస్‌ అండ్‌ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌  మొహ్‌సెన్‌ అల్‌ షారికి మాట్లాడుతూ ఎగ్జుక్యూటివ్‌ రెగ్యులేషన్స్‌ - రెసిడెన్స్‌ అండ్‌ ఫారినర్స్‌ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు చేసినట్టు‌ వెల్లడించారు. వలసదారులు తమ రెసిడెంట్‌ వీసాని ఒక ఎంప్లాయర్‌ నుంచి మరో ఎంప్లాయర్‌కి మార్చుకోవచ్చు. ఆధారాలతో సహా కాంట్రాక్టు గడువు/ కాంట్రాక్టు రద్దు ‌ని నిరూపించాల్సి వుంటుంది. జనవరి 2021 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అవసరమైన అన్ని నిబంధనలను పాటించినప్పుడు, వలసదారు రెసిడెన్స్‌కి సంబంధించి మొదటి ఎంప్లాయర్‌ బాధ్యత చెల్లుబాటవుతుంది. ప్రస్తుతం వున్న విధానం ప్రకారం 'ఎన్‌ఓసి'ని సమర్పిస్తే ఓ కంపెనీ నుంచి మరో కంపెనీలోకి వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. లేదంటే, ఒమన్‌ ని విడిచి వెళ్ళి, రెండేళ్ల తర్వాత రావాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com