సౌదీ: డాక్టర్లకు కరోనా..హాస్పిటల్ మూసివేత

- June 08, 2020 , by Maagulf
సౌదీ: డాక్టర్లకు కరోనా..హాస్పిటల్ మూసివేత

సౌదీ: సౌదీలో నిబంధనలను సడలించి యధాతథ ప్రజాజీవనాన్ని ప్రోత్సహించగా పలు అవాంఛిత సంఘటనలు చోసుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఇమామ్ కు కరోనా సోకిందని మసీదును మూసివేశారు. ఇప్పుడు ఏకంగా ఒక ప్రైవేటు హాస్పిటల్ లోని డాక్టర్ కు కరోనా సోకగా ఆ హాస్పిటల్ ను మూసివేస్తున్నట్టు తాజా ప్రకటన.

సౌదీ అరేబియాలోని ఖోబార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో అధిక సంఖ్యలో వైద్యులకు కరోనా సోకడంతో ఆ హాస్పిటల్ మూసివేయబడింది. కరోనా రోగులకు చికిత్స చేసి ఎటువంటి సామాజిక దూరం పాటించకుండా సహా ఉద్యోగులతో మెలగటంతో హాస్పిటల్ లోని ఎక్కువ సంఖ్య లో వైద్యులకు కరోనా సోకిందని తెలిపిన సౌదీ మీడియా. వ్యాప్తిని నియంత్రించడానికి మరియు పరిస్థితిని చక్కదిద్దుటకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది.

గత నెలలో మక్కాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మరియు ఒక నర్సు కరోనావైరస్ బారిన పడి మరణించటం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com