రెక్లెస్ డ్రైవింగ్: ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష
- June 08, 2020
మనామా:ఓ బహ్రెయినీ వ్యక్తికి న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడు రెక్లెస్ డ్రైవింగ్‌కి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నాలుగవ మైనర్ క్రిమినల్ కోర్ట్ నిందితుడికి మూడు నెలల జైలు శిక్షతోపాటుగా 720 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. బుడైయా హైవేపై తన వాహనాన్ని నిందితుడు ప్రమాదకరమైన రీతిలో నడిపినట్లు తేలింది. మే 28న నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడి డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. అల్ కాదాం విలేజ్ దగ్గరలో నిందితుడు ప్రమాదకర స్టంట్స్ చేశాడు. నిందితుడు తన వాహనాన్ని నెంబర్ ప్లేట్ కూడా లేకుండా నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







