యూఏఈ: ఆమ్నెస్టీ ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం

- June 09, 2020 , by Maagulf
యూఏఈ: ఆమ్నెస్టీ ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం

అబుధాబి: జరిమానాలు మాఫీ చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గత నెలలో జారీ చేసిన విషయం తెలిసిందే. తదనుగుణంగా, 2020 మార్చి 1 లోపు వీసాల గడువు ముగిసిన అక్రమ నివాసితులందరికీ దేశం నుండి బయలుదేరేటప్పుడు జరిమానాలు మాఫీ చేయడానికి అవసరమయ్యే చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ మరియు ప్రయాణ టికెట్ అవసరం అని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్‌ మేజర్ జనరల్ సయీద్ రాకన్ అల్ రషీది తెలిపారు.

విమానాశ్రయాలకు కొన్ని గంటల ముందే..
గడువు ముగిసిన విసిట్/టూరిస్ట్ వీసాలు కలిగి ఉన్నవారికి, మాఫీ నుండి ప్రయోజనం పొందే సౌకర్యాన్ని వినియోగుకోవటానికి ఉల్లంఘకులు యూఏఈ లోని ఏ విమానాశ్రయం నుండి అయినా ప్రయాణించవచ్చు. కానీ, వారు విమానాశ్రయానికి ఎప్పుడూ వెళ్లే సమయం కంటే కొన్ని గంటల ముందు వెళ్లాలి. అబుదాబి, షార్జా మరియు రస్ అల్ ఖైమా విమానాశ్రయాలలో బయలుదేరే సమయానికి ఆరు గంటల ముందు విమానాశ్రయాలకు వెళ్లాలి. అదే దుబాయ్ నుండి బయలుదేరడానికి నిర్ణయించుకుంటే, బయలుదేరే సమయానికి 48 గంటల ముందు అతను తనిఖీ కేంద్రానికి వెళ్లాలి అని మేజర్ జనరల్ అల్ రషీది సోమవారం ఒక వర్చువల్ సమావేశంలో అన్నారు.

తనిఖీ కేంద్రాలు..
దుబాయ్ తనిఖీ కేంద్రాలు; అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్, సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సెంటర్ మరియు టెర్మినల్ 2 సమీపంలో బహిష్కరణ కేంద్రం. 15 ఏళ్లలోపు వయసున్నవారు మరియు వికలాంగులు తనిఖీ కేంద్రాలకు వెళ్లనవసరంలేదు. ఏదైనా సందేహాలు ఉంటే ప్రజలు 800453 కు కాల్ చేయవచ్చని, సెలవులు మినహా కాల్ సెంటర్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది అని మేజర్ జనరల్ అల్ రషీది తెలిపారు.

ఎవరెవరికి వర్తిస్తుంది..
ఆమ్నెస్టీ కాలం అయిన 2020 మే 18 నుండి ఆగస్టు 18 మధ్య దేశం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న గడువు ముగిసిన విసిట్/రెసిడెన్సీ అనుమతి ఉన్నవారికి జరిమానా పూర్తిగా మాఫీ చేయబడుతుంది.  జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం వీసా ఉల్లంఘించినవారికి జరిమానాలు చెల్లించడం, ప్రయాణ రుసుము చెల్లించడం, వర్కర్ కార్డు మరియు కాంట్రాక్టు జరిమానాలు చెల్లించడం, బయలుదేరే అనుమతి రుసుము చెల్లించడం నుండి మినహాయింపు లభిస్తుంది. ఇతరులకు స్పాన్సర్ చేస్తున్నా మరియు దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వ్యక్తులు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్పాన్సర్ చేస్తున్న వ్యక్తులతో సహా దేశం విడిచి వెళ్ళాలి అని మేజర్ జనరల్ అల్ రషీది అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com