వేసవిలో కార్మికుల పని గంటల కుదింపు.. షెడ్యూల్ ప్రకటించిన ఖతార్ ప్రభుత్వం

- June 10, 2020 , by Maagulf
వేసవిలో కార్మికుల పని గంటల కుదింపు.. షెడ్యూల్ ప్రకటించిన ఖతార్ ప్రభుత్వం

దోహా:వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పని చేసే కార్మికుల పని గంటలను కుదించింది ఖతార్ ప్రభుత్వం. ప్రతి రోజు 11.30 నుంచి 3.00 గంటల వరకు కార్మికులకు విశ్రాంతి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ, కార్మిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు మధ్యాహ్నం సమయంలో కార్మికులతో ఎలాంటి పనులు చేయించవద్దని ఆయా సంస్థలు, కంపెనీల యాజమాన్యాలకు సూచించింది. పగటి సమయంలో 5 గంటలకు మించి పని వేళలు ఉండరాదని కూడా స్పష్టం చేసింది.

కార్మిక చట్టం 2004 లో లా నంబర్ 14 నిబంధనలకు లోబడి ఉన్న సంస్థలు, కంపెనీలన్నీ 2007లో మంత్రిత్వ శాఖ చేసిన తీర్మానం నెంబర్ 16 కు అనుగుణంగా పనివేళలు ఉండాలని కార్మిక శాఖ తమ అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. వేసవిలో కార్మికుల పనిగంటల నిబంధనలను ఆయా కంపెనీలు నిఖచ్చిగా అమలు చేసి తీరాల్సిందేనని కూడా హెచ్చరించింది. లేబర్ ఇన్స్ పెక్టర్లు..పలు కంపెనీల పని ప్రదేశాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతారని, నిబంధలను ఉల్లంఘించిన కంపెనీ యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా కార్మిక శాఖ హెచ్చరించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com