భారతీయ సిబ్బందిని ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో పంపిన సౌదీ సంస్థ
- June 10, 2020
రియాద్: కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందిన ఎక్సపెర్టిస్ కాంట్రాక్టింగ్ కంపెనీ ఐదు దేశాలకు చెందిన సుమరు 2 వేల మంది సిబ్బందిని ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో పంపింది. ఇందులో 1,665 మంది భారతీయులున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 50 ఏండ్లుపైబడిన వారు, గర్భవతులు, వైద్య సేవలు అవసరమైన వారిని గల్ఫ్ ఎయిర్‌కు చెందిన 12 చార్టర్డ్ విమానాల్లో వారి దేశాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 7 వరకు చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, మంగళూరుకు ఆరు విమానాల ద్వారా కొందరు చేరుకున్నట్లు వెల్లడించింది. జూన్ 11 నాటికి మరో మూడు విమానాలు భారత్‌కు చేరుతాయని, ఇక్కడితో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆ సంస్థ తెలిపింది.
సిబ్బంది ప్రయాణ వ్యయాలతోపాటు క్వారంటైన్ ఖర్చులను సంస్థే భరిస్తున్నదని, వారిని ఇలా తరలించడం ఇదే తొలిసారని ఆ కంపెనీ తెలిపింది. మరి కొంత మంది సిబ్బందిని కూడా వారి దేశాలకు తరలించే యోచనలో ఉన్నామని, కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులు కుదుటపడిన తర్వాత వారు పని చేసే కంపెనీలకు తిరిగి రప్పిస్తామని ఆ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు