నెక్ట్స్ ఫిల్మ్ కోసం సోషల్ మీడియాలో లైవ్ ఆడిషన్ నిర్వహించనున్న డైరెక్టర్ తేజ
- June 10, 2020
డైరెక్టర్ తేజ తన తర్వాతి సినిమాతో ప్రతిభావంతులైన నటులను పరిచయం చేయనున్నారు. దీని కోసం టాలీవుడ్లోనే మొట్టమొదటి సారిగా, సోషల్ మీడియా వేదిక ద్వారా ఆడిషన్ నిర్వహించనుండటం విశేషం. టాలీవుడ్‌కు ప్రతిభావంతుల్ని పరిచయం చేసే ఈ అవకాశాన్ని హలో యాప్ చేజిక్కించుకుంది. హలో యాప్‌లో అప్లోడ్ చేసిన అప్లికేషన్లను మాత్రమే ఫైనల్ ఆడిషన్ కోసం పరిగణనలోకి తీసుకుంటామని తేజ స్పష్టం చేశారు.
ప్రతిష్ఠాత్మక బ్యానర్లు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. తన బర్త్‌డే సందర్భంగా రెండు చిత్రాల్ని దర్శకుడు తేజ అనౌన్స్ చేశారు. వాటిలో ఒకటి రానా దగ్గుబాటితో తీసే 'రాక్షసరాజు రావణాసురుడు' సినిమా కాగా, మరొకటి గోపీచంద్‌తో రూపొందించనున్న 'అలిమేలుమంగ వేంకటరమణ' చిత్రం.
ఈ రెండింటిలో ఏ సినిమా కోసం ఈ ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారనే విషయాన్ని త్వరలో వెల్లడి చేస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు