ఒమన్‌లో టూరిజం ఎట్రాక్షన్స్‌ మూసివేత, కొత్త బిజినెస్‌ల పునః ప్రారంభం

- June 10, 2020 , by Maagulf
ఒమన్‌లో టూరిజం ఎట్రాక్షన్స్‌ మూసివేత, కొత్త బిజినెస్‌ల పునః ప్రారంభం

ఒమాన్: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ, ఓ సమావేశాన్ని నిర్వహించింది. మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ సయ్యిద్‌ హమౌద్‌ బిన్‌ ఫైసల్‌ అల్‌ బుసైదీ ఈ మీటింగ్‌కి నాయకత్వం వహించారు. జబెల్‌ అక్‌దర్‌, జబెల్‌ షాంస్‌, మసిరాహ్‌ మరియు దోఫార్‌ గవర్నరేట్స్‌ పరిధిలోని టూరిజం డెస్టినేషన్స్‌ని మూసివేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 13 నుంచి జులై 3 వరకు ఈ లాక్‌డౌన్‌ అమల్లో వుంటుంది. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుందని ఈ సందర్భంగా కమిటీ పేర్కొంది. ఎక్కువమంది గుమికూడే అవకాశం వున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జూన్‌ 10 నుంచి కొత్త ప్యాకేజీని కమర్షియల్‌ మరియు ఇండస్ట్రియల్‌ యాక్టివిటీస్‌ కోసం అమల్లోకి తీసుకొచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com