ఫేక్‌ రూమర్స్‌ని ప్రచారం చేస్తే ఏడాది, ఆపైన జైలు శిక్ష

- June 10, 2020 , by Maagulf
ఫేక్‌ రూమర్స్‌ని ప్రచారం చేస్తే ఏడాది, ఆపైన జైలు శిక్ష

షార్జా: ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా దుష్ప్రచారానికి ఒడిగడితే ఏడాది అంతకు మించి జైలు శిక్ష విధించడం జరుగుతుందని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ స్పష్టం చేసింది. ఫెడరల్‌ పీనల్‌ కోడ్‌ - ఆర్టికల్‌ 198, పేరాగ్రాఫ్‌ ప్రకారం ఎవరైతే కావాలని దుష్ప్రచారానికి దిగుతారో, రూమర్స్‌ని ప్రచారం చేస్తారో, ప్రజల్లో అనవసర భయాందోళనలకు కారకులవుతారో అలాంటివారికి ఏడాదికి తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుందని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తెలిపింది. కాగా, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ స్మార్ట్‌ ప్లాటుఫార్మ్స్ ద్వారా పిటిషన్‌ లేదా కంప్లయింట్‌ నమోదు చేసే విధానాన్ని వెల్లడించారు. ఇదిలా వుంటే, షార్జాలో సెక్యూరిటీ సర్వీసెస్‌, ఓ ట్యాక్సీ డ్రైవర్‌ని అరెస్ట్‌ చేయడం జరిగింది. రద్దు చేయబడిన‌ పనులను రోడ్డుపై ప్రదర్శిస్తున్నట్లు అతనిపై అభియోగాలు వచ్చాయి. 

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com