సౌదీ అరేబియా:కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్న 5,200 మంది ప్రవాసీయులు
- June 11, 2020
సౌదీ అరేబియా:కరోనా వ్యాప్తి నియంత్రణకు మదీనా మున్సిపాలిటి చేపట్టిన కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలను ప్రవాసీయులు సద్వినియోగ పరుచుకుంటున్నారు. దాదాపు 5,200 మంది ప్రవాసీయులు వైరస్ నిర్ధారణ పరీక్షల శిబిరాలకు వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. మదీనా మున్సిపాలిటి పరిధిలోని పండ్లు, కూరగాయల మార్కెట్ తో పాటు షాపింగ్ మాల్స్, ప్రవాసీయులు ఉండే ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే వలస కార్మికులు ఎక్కువ ఉండే చోట ధర్మల్ ఇమేజింగ్, మాస్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వైరస్ బారిన పడిన వారిని తక్షణమే గుర్తించేందుకు మొబైల్ థర్మల్ కెమెరాలను వినియోగిస్తున్నారు. అలాగే కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రవాసీయులకు పలు సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







