దర్శకుడు సుజీత్ నిశ్చితార్థం..
- June 11, 2020
రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్ గా మారి.. ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలని మరే సినిమా ఒప్పుకోకుండా ప్రభాస్ కోసం చాలా కాలం వేచి చూసి.. 'సాహో' సినిమాని తీశాడు సుజీత్. ఇప్పుడు సుజీత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
అనుకున్న ప్రకారం ఆయన ఈనెల 10న నిశ్చితార్థం జరుపుకున్నారు. ప్రవళిక అనే అమ్మాయితో సుజీత్ నిశ్చితార్థం పూర్తయ్యింది. లాక్ డౌన్ వల్ల నిశ్చితార్ధంను సింపుల్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యారు. ప్రస్తుతం సుజీత్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్లో ఇటీవలే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఇదే జాబితాలో సుజిత్ కూడా త్వరలో చేరనున్నారు. ప్రవళిక అనే డెంటిస్ట్‌తో గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో త్వరలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సుజీత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు . 'లూసిఫర్' రీమేక్‌ను తెలుగులో సుజీత్ డైరెక్ట్ చేయబోతున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు