నోట్లను చించినా, కాల్చినా, అవమానించినా భారీ జరిమానా..యూఏఈ వార్నింగ్

- June 14, 2020 , by Maagulf
నోట్లను చించినా, కాల్చినా, అవమానించినా భారీ జరిమానా..యూఏఈ వార్నింగ్

యూఏఈ కరెన్సీని కించపరిచేలా ఎలాంటి పనులు చేసినా కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను హెచ్చరించింది. నోటుపై  జాతీయ చిహ్నం ఉంటుంది కనుక దాన్ని కాగితం ముక్కలాగ తీసివేసే ధోరణిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చింది. నోటు మెటిరియల్ కన్నా..నోటుపై ఉండే జాతీయ చిహ్నాన్ని గౌరవించటం ప్రజల నైతిక బాధ్యత అతని గుర్తు చేసింది. కరెన్సీ నోటును చించినా, తగలబెట్టినా, నాశనం చేసినా, కించపరిచేలా వ్యవహరించినా..ఆ కరెన్సీ నోటుకు విలువకు పది రెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే సోషల్ మీడియాలో వీడియోలను అప్ లోడ్ చేసే ముందు, పోస్టులు పెట్టే ముందు నెటిజన్లు కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కూడా సూచించింది. యూఏఈ చట్టాల ప్రకారం ప్రభుత్వాన్ని కించపరిచే చర్యలు, జాతీయ చిహ్నాం గౌరవాన్ని కించపరిచే చర్యలపై కఠిన శిక్షలు ఉంటాయి. నేర తీవ్రతను బట్టి ఒక్కోసారి కనిష్టం 10 ఏళ్ల నుంచి గరిష్టం 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ గీతం, జాతీయ జెండాను అవమానించిన, దేశ గౌరవ సూచికలను కించపరిచినా, పాలకులను అవమానించేలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా మిలియన్ దిర్హామ్ ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అంతా దేశ గౌరవాన్ని పెంపొందించేలా పాటుపడాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలకు సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com