మనామా:ఫేస్ మాస్క్ ధరించని 721 మందికి జరిమానా
- June 14, 2020
మనామా:కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబధనలు పాటించని దాదాపు 721 మందికి పోలీసులు జరిమానా విధించారు. ఎపిడమిక్ యాక్ట్ అమలులో భాగంగా కరోనా కట్టడికి బహ్రెయిన్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బహరింగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని, ఒకే చోట ఐదుగురికి మించి గుమికూడొద్దని..ఆ ఐదుగురు కూడా ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలనే ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే..ఓ వైపు కరోనా ఇంకా నియంత్రణలోకి రాకుండా భయపెడుతున్నా..కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫేస్ మాస్కులు ధరించకుండానే పబ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ముహర్రఖ్ ప్రాంతంలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా తిరుగుతున్న 721 మందికి పోలీసులు ఫైన్ వధించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







