నోట్లను చించినా, కాల్చినా, అవమానించినా భారీ జరిమానా..యూఏఈ వార్నింగ్
- June 14, 2020
యూఏఈ కరెన్సీని కించపరిచేలా ఎలాంటి పనులు చేసినా కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను హెచ్చరించింది. నోటుపై జాతీయ చిహ్నం ఉంటుంది కనుక దాన్ని కాగితం ముక్కలాగ తీసివేసే ధోరణిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చింది. నోటు మెటిరియల్ కన్నా..నోటుపై ఉండే జాతీయ చిహ్నాన్ని గౌరవించటం ప్రజల నైతిక బాధ్యత అతని గుర్తు చేసింది. కరెన్సీ నోటును చించినా, తగలబెట్టినా, నాశనం చేసినా, కించపరిచేలా వ్యవహరించినా..ఆ కరెన్సీ నోటుకు విలువకు పది రెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే సోషల్ మీడియాలో వీడియోలను అప్ లోడ్ చేసే ముందు, పోస్టులు పెట్టే ముందు నెటిజన్లు కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కూడా సూచించింది. యూఏఈ చట్టాల ప్రకారం ప్రభుత్వాన్ని కించపరిచే చర్యలు, జాతీయ చిహ్నాం గౌరవాన్ని కించపరిచే చర్యలపై కఠిన శిక్షలు ఉంటాయి. నేర తీవ్రతను బట్టి ఒక్కోసారి కనిష్టం 10 ఏళ్ల నుంచి గరిష్టం 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ గీతం, జాతీయ జెండాను అవమానించిన, దేశ గౌరవ సూచికలను కించపరిచినా, పాలకులను అవమానించేలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా మిలియన్ దిర్హామ్ ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అంతా దేశ గౌరవాన్ని పెంపొందించేలా పాటుపడాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు