దోఫర్ గవర్నరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలు, పర్యాటక ప్రాంతాల మూసివేత

- June 14, 2020 , by Maagulf
దోఫర్ గవర్నరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలు, పర్యాటక ప్రాంతాల మూసివేత

మస్కట్:కరోనా కట్టడిలో భాగంగా దోఫర్ గవర్నరేట్ పరిధిలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. సుల్తాన్ సాయుధ బలగాలతో పాటు, రాయల్ ఓమన్ పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్స్ ను ఏర్పాటు చేశారు. పౌరులు, ప్రవాసీయులు ఈ విషయాన్ని గమనించి దోఫర్ గవర్నరేట్ ప్రాంతంలోకి అత్యవసరం అయితే రావొద్దని కూడా అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకు దోఫర్ పరిధిలో నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జబల్ షామ్స్, జబల్ అల్ అఖ్దర్, మాసిరా ద్వీపంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను మూసివేయించారు. సుప్రీం కమిటీ సూచనల మేరకు లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేసేలా భద్రత బలగాలకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com