సుశాంత్ మరణ వార్త విని ఆయన మరదలు కూడా...
- June 16, 2020
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త యావత్ సినీ ఇండస్ట్రీని కలచివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ అంత్యక్రియలు జరిగి 24 గంటలు కాకముందే ఆయన మరదలు (సుశాంత్ కజిన్ భార్య) సుధా దేవి బీహార్ లోని పుర్నియాలో తుది శ్వాస విడిచింది. ముంబయిలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినప్పటి నుండి ఆమె ఆహరం తీసుకోవడం మానేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు