కార్మికులను మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై దృష్టి: విదేశాంగ మంత్రి మురళీధరన్
- June 16, 2020
భారత విదేశాంగ శాఖ: న్యూ ఢిల్లీలో జరిగిన 3 వ వార్షిక 'ప్రొటెక్టర్స్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' సమావేశంలో విదేశాంగ మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ కార్మికులను ఉపాధి పేరిట మోసం చేస్తూ విదేశాలకు పంపుతున్న నకిలీ ఏజెన్సీలపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. అటువంటి ఏజెన్సీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించి వారిపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అనధికార ఏజెన్సీల అనైతిక వ్యూహాలకు బలైపోతున్న వలసదారుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశీ ఉపాధి కోసం వెళ్లే కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడానికి గత ఆరు సంవత్సరాల్లో చర్యలు తీసుకున్నప్పటికీ, మోసం, అక్రమ వలసలు మరియు సాంకేతిక దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను నమోదవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు నియంత్రణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం త్వరలో కొత్త ఇమ్మిగ్రేషన్ మేనేజ్మెంట్ బిల్లును తీసుకువస్తుందని మురళీధరన్ అన్నారు. ఈ బిల్లు ద్వారా సురక్షితమైన ఇమ్మిగ్రేషన్ వాతావరణానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు.
"చాలా సంవత్సరాలుగా విదేశాలలో నివసించిన అధునాతన నైపుణ్యం గల ఎందరో వలసదారులు కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయి స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. వీరు తమ నైపుణ్యంతో భారతదేశ అభివృద్ధికి దోహదపడతారు. కాబట్టి 'వందే భారత్ మిషన్' ద్వారా ఈ డేటా ను సేకరించి అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉన్నాము" అని ఈ సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?