హమ్మో..మరీ ఇంత కోపమా!

- June 16, 2020 , by Maagulf
హమ్మో..మరీ ఇంత కోపమా!

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువకుడు దక్కకపోతే.. మనసంతా బాధగా ఉంటుంది. ప్రేమించిన వాడే తనను కాదన్నప్పుడు.. ఈ జీవితం తనకెందుకు అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఏం చేయాలో తోచక.. అనాలోచిత నిర్ణయాల వైపు అడుగులేస్తుంటారు ప్రేమికులు. అలా ఓ యువతి.. తన ప్రేమ విఫలమైందని బాధపడుతూ.. విమానం కిటికీని పగులగొట్టింది.

మే 25వ తేదీన లీ అనే 29 ఏళ్ల యువతి లూంగ్‌ ఎయిర్‌లైన్స్‌లో గ్జినింగ్‌ నుంచి యాచ్చెంగ్‌కు బయల్దేరింది. ఉన్నట్టుండి విమానం కిటికీపై పంచుల వర్షం కురిపించింది. అప్రమత్తమైన విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులు ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే విమానం కిటికీ స్వల్పంగా పగిలిపోయింది. దీంతో విమానాన్ని జెంగ్చూ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

అక్కడ లీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. జరిగిన విషయాన్ని చెప్పింది. తన ప్రేమను ఓ యువకుడు తిరస్కరించినందుకు బాధ పడుతున్నానని తెలిపింది. తీవ్ర మనోవేదనకు గురవుతున్న తాను.. దాన్నుంచి బయటపడాలని, విమానం ఎక్కేముందే ఆల్కహాల్‌ సేవించానని పేర్కొంది. ప్రేమ విఫలమైందనే బాధతో, మద్యం మత్తులో ఉన్న తాను ఏం చేశానో అర్థం కాలేదని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com