కరోనా తో హడలిపోతున్న బీజింగ్

- June 16, 2020 , by Maagulf
కరోనా తో హడలిపోతున్న బీజింగ్

బీజింగ్: చైనా రాజధాని పరిస్థితి దారుణంగా ఉందని సాక్షాత్తూ అధికారి ప్రతినిధి బహిరంగ వ్యాఖ్యలు చేశారంటే అక్కడి స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

స్థానిక జింన్‌ఫాడీ మార్కెట్ తాజాగా కరోనా కేసులకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. కరోనాను అదుపులోకి తెచ్చామని ఊపిరి పీల్చుకుంటున్న చైనా.. జింన్‌ఫాడీలో కరోనా కేసులు వేలుగు చూడటంతో ఒక్కసారిగి ఉల్లిక్కిపడింది. కరోనా మరోసారి వీపరీతంగా వ్యాపిస్తుందేమోనని స్థానిక ప్రభుత్వం భయపడిపోయింది. దురదృష్టవశాత్తూ అనుకున్నదంతా జరిగింది. కేవలం ఐదు రోజుల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోజుకు సగుటున పదుల సంఖ్యలో కొత్త కేసుల చూడటంతో ప్రస్తుతం బీజింగ్‌లో కరోనా కేసుల సంఖ్య 106కి చేరింది. మంగళవారం నాడు కూడా ఏకంగా 27 కొత్త కేసులు నమోదయ్యాయి.

పరిస్థితి చేయిదాటుతోందని అంతకుమునుపే గ్రహించిన ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రజలకు సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే రాజదానిలో దాదాపు 30 ప్రాంతాలను పూర్తిగా లాక్ డౌన్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి విషమంగా ఉందంటూ అధికార ప్రతినిధి బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచ దేశాలన్నీ మరో కుదుపునకు లోనయ్యాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్ నగర విస్తీర్ణం, జనాభా, దేశంలోని ఇతర ప్రాంతాలతో నగరాన్ని కున్న సంబంధం వంటివాటి దృష్ట్యా ప్రభుత్వం అక్కడి పరిస్థితిని తక్షనం అదుపులోకి తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com