జూన్ 23 నుంచి విదేశాల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్..ప్రకటించిన యూఏఈ
- June 16, 2020
యూఏఈ:కరోనా తర్వాత సాధారణ జనజీవన పునరుద్ధరణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది యూఏఈ ప్రభుత్వం. యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 23 నుంచి దేశ పౌరులు, ప్రవాసీయుల విదేశీ ప్రయాణాలకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ, పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య శాఖలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. అయితే..యూఏఈ నుంచి ఏయే గమ్యస్థానాలకు అనుమతి ఉంటుందో త్వరలోనే వెల్లడిస్తామని కూడా అధికారులు తెలిపారు. అయితే..కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు..ఎప్పుడు తిరిగి వస్తారు..తిరిగి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ప్రయాణ సమయంలో వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







