ఇండియా చైనా ఘర్షణ: భారత్ దే తప్పంటున్న పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి
- June 17, 2020
ఇండియా చైనా దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి అంటే మొదటగా సంతోషపడే దేశం పాకిస్తాన్. ఎందుకంటే, ఇండియాకు పాక్ శత్రుదేశం. చైనాకి ఆప్తమిత్రదేశం పాక్. ఇండియా, పాక్ దేశాల సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఎప్పుడూ చూడలేదు. నిత్యం ఘర్షణలు, ఫైరింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే, చైనాతో ఇండియాకు బోర్డర్ వివాదం ఉన్నప్పటికీ, 1962 యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య ఎప్పుడూ కూడా పెద్దగా గొడవలు జరగలేదు.
ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన బాహాబాహీ వలన 20 మంది ఇండియన్ ఆర్మీ, 43 మంది చైనా ఆర్మీ మరణించారు. దీనిపై పాక్ విదేశాంగశాఖా మంత్రి స్పందించారు. ఇండియన్ ఆర్మీనే మొదట కవ్వింపు చర్యలకు పాల్పడిందని, తప్పనిసరి పరిస్థితుల్లో చైనా ఆర్మీ కూడా ఇలా దాడి చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇండియా సరిహద్దు దేశాలతో సవ్యంగా ఉండటం లేదని అన్నారు. చైనా దేశం, చైనా ఆర్మీ చాలా మంచివారు అన్నట్టుగా మాట్లాడాడు ఖురేషి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!