కరోనాకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయమని పిటిషన్.. రూ.5లక్షలు ఫైన్ వేస్తూ ఘాటుగా స్పందించిన హైకోర్టు
- June 17, 2020
కరోనా వైరస్ సోకిన పేషెంట్లు అందరికీ ఉచితంగా చికిత్స అందించాలని కోరుతూ..పిటిషన్ వేసిన ఓ వ్యక్తికి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రముఖ విద్యావేత్త సాగర్ జోంధాలే బాంబే హైకోర్టులో కరోనా సోకిన బాధితులకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయాలని పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ డిమాండ్ అర్థం పర్థం లేనిదంటూ వ్యాఖ్యానిస్తూ..పిటిషనర్ కు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం జరిమానాని నెల రోజుల్లో ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. దీంతో సదరు పిటీషన్ దారుడు ఆశ్చర్యపోయాడు.
కరోనాను ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని... అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా బాధితులందరికీ ఉచితంగా చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరుతూ వేసిన పిటిషన్ కు ఇటువంటి షాక్ ఇవ్వటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.
పేదవారు గొప్పవారు అనే తేడా లేకుండా కరోనా కాటుకు ప్రజలు బలైపోతున్న క్రమంలో కరోనాను అడ్డంపెట్టుకుని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కరోనా బాధితులకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయాలని కోరుతూ వేసిన పిటీషన్ దారుడిపై న్యాయస్థానం స్పందన కాస్త ఘాటుగానేఉంది. పిటీషన్ అర్థరహితమైతే కొట్టేయవచ్చు. కానీ ఇలా పిటీషన్ దారుడికి జరిమానా వేయటం ఆశ్చర్యాన్నికలిగిస్తోంది.
కాగా..కరోనాతో ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లిన ఓ వ్యక్తికి సదరు ఆస్పత్రి రూ.1లక్ష బిల్లు వేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







