గల్వాన్ ఘటన: వీరమరణం పొందిన సైనికుల పేర్లు
- June 17, 2020
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా దురాగతాలకు 20 మంది భారత సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే.. లద్దాఖ్‌లోని గాల్వన్‌లోయలో చైనా సైనికులు.. మన జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో దాడికి దిగడంతో... వారికి మన సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. పుట్టిన గడ్డ కోసం ప్రాణత్యాగం చేసిన 20 మంది వీర సైనికులు ఎవరనేది బయటకు వచ్చింది.. వారి పేర్లకు సంబంధించిన జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
వీరమరణం పొందిన సైనికులు వీరే:
1. బిక్కుమళ్ల సంతోష్ బాబు - సూర్యాపేట, తెలంగాణ
2. నాథూరామ్ సోరెన్ - మయూర్ భంజ్, ఒడిస్సా
3. మనుదీప్ సింగ్- పాఠియాలా, పంజాబ్
4. సత్నాం సింగ్ - గుర్దాస్ పూర్, పంజాబ్
5. కె. పళని - మధురై, తమిళనాడు
6. సునీల్ కుమార్ - పాట్నా, బీహార్
7. బిపుల్ రాయ్ - మీరట్, ఉత్తర ప్రదేశ్
8. దీపక్ కుమార్ - రెవా, మధ్యప్రదేశ్
9. రాజేష్ ఓరాంగ్ - బిర్బం, పశ్చిమ బెంగాల్
10. కుందన్ కుమార్ ఓఝా - సహీబ్ గంజ్, ఝార్ఖండ్
11. గణేష్ రామ్ - కన్కేర్, ఛత్తీస్ ఘడ్
12. చంద్రకాంత ప్రదాన్ - కందామళ్, ఒడిస్సా
13. అంకుష్ - హమీర్ పుర్, హిమాచల్ ప్రదేశ్
14. గుర్బిందర్ - సంగ్రూర్, పంజాబ్
15. గుర్తేజ్ సింగ్ - మన్సా, పంజాబ్
16. చందన్ కుమార్ - భోజ్ పూర్, బీహార్
17. కుందన్ కుమార్- సహర్స, బీహార్
18. అమన్ కుమార్ - సంస్థిపూర్, బీహార్
19. జై కిషోర్ సింగ్- వైశాలి, బీహార్
20. గణేష్ హన్సదా - ఈస్ట్ సింగ్భూమ్, ఝార్ఖండ్
కాగా.. ఈ ఘర్షణలకు సంబంధించి భారత సైన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత, చైనా సైన్యాలకు సోమవారం రాత్రి, మంగళవారం ఘర్షణ జరిగిన గాల్వన్ ప్రాంతంలో ఇరువర్గాలూ వెనక్కి తగ్గాయని అందులో పేర్కొంది. ఈ ఘర్షణల్లో కర్నల్ సంతోష్ బాబు, ఇద్దరు సైనికులు (కె.పళని (తమిళనాడు), ఓఝా (ఝార్ఖండ్)) చనిపోయినట్టు తొలుత ప్రకటించిన ఆర్మీ.. తీవ్రంగా గాయపడిన మరో 17 మంది సైనికుల పరిస్థితి అక్కడి మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల మరింత విషమించి, ప్రాణాలు కోల్పోయారని వ్లెలడించింది. దీంతో అమరులైన జవాన్ల సంఖ్య 20కి చేరినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







