దోహా:మిట్రాష్2 యాప్ ద్వారా ప్రీ ఎంట్రీ పర్మిట్ వీసా గడువు పెంపు

- June 18, 2020 , by Maagulf
దోహా:మిట్రాష్2 యాప్ ద్వారా ప్రీ ఎంట్రీ పర్మిట్ వీసా గడువు పెంపు

దోహా:కరోనా నేపథ్యంలో ప్రీ ఎంట్రీ వీసా సేవా కేంద్రాలను సందర్శించకుండానే వీసా గడువును పెంచుకునేందుకు ఖతార్ ప్రభుత్వం వీలు కల్పించింది. ఇందుకోసం మీట్రాష్ 2 యాప్ ను వీసాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రీ ఎంట్రీ పర్మిట్ వీసాలను గడువు ముగిసే మూడు రోజులకు ముందుగానే మళ్లీ పొడిగించుకునే అవకాశం ఉంటుందని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ యాప్ ద్వారా అతి సులభంగా వీసా గడువును పెంచుకోవచ్చని కూడా తెలిపింది. మిట్రాష్ 2 యాప్ కు సంబంధించి ఏవైనా సాంకేతిక సహాయం, ఇతర అనుమానాలు ఉంటే  2342000 నెంబర్ కి కాల్ చేసి వివరాలను పొందవచ్చని ప్రకటించింది.  

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com