మస్కట్:వేర్వేరు చోరీల కేసుల్లో ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
- June 18, 2020
ఒమన్ లో వేర్వేరుగా చోటుచేసుకున్న చోరీల కేసులలో ఆరుగురు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర అల్ బటినా గవర్నరేట్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో ఘటనలో మొబైల్ స్టోర్ నుంచి మొబైల్స్ దొంగించిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. ఈ ఇద్దరిపై చోరీతో పాటు మోసానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే దక్షిణ అల్ షార్కియా గవర్నరేట్ పరిధిలో పశువుల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జలన్ బని బు అలీ ప్రాంతంలో 11 పశువులను ముగ్గురు నిందితులు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







