కువైట్ లో అన్ లాక్ 1.0 అమలు..దశల వారీగా కర్ఫ్యూ సడలింపు
- June 19, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ తర్వాత సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కువైట్ ప్రభుత్వం దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలోని ఇప్పటికే అమలులో ఉన్న కర్ఫ్యూ సమయాల్లో పాక్షిక మార్పులు చేయాలని కువైట్ మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 21 నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ సమయాన్ని రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మారుస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి దిగ్భంధం అమలులో ఉన్న ప్రాంతాల్లో కూడా ఆంక్షలను సడలించింది. హవాలి, అల్ నగ్ర, మైదాన్ హవాలి, ఖైతాన్ ప్రాంతాల్లో జూన్ 21 నుంచి ఐసోలేషన్ ఆంక్షలను రద్దు చేసింది. అలాగే ఫర్వానియా, జ్లీబ్, మహబౌల్లా మాత్రం లాక్ డౌన్ యధావిధిగా కొనసాగించనున్నారు. దేశంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు తొలి దశలో భాగంగా ఈ నిర్ణయాలను అమలు చేస్తున్నట్లు మంత్రివర్గం తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా రెండో దశ అన్ లాక్ ప్రక్రియను కూడా అమలు చేయనున్నట్లు మంత్రివర్గం వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు